రకుల్ నటించిన ఆ సీన్ పై అభ్యన్తరం తెలిపిన సెన్సార్ బోర్డ్

Published on May 16, 2019 12:02 pm IST

టాలీవుడ్ అందరు టాప్ స్టార్స్ తో నటించిన రకుల్ ప్రీత్ ప్రస్తుతం తన అదృష్టాన్ని బాలీవుడ్లో పరీక్షించుకుంటుంది. సౌత్లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ పై ఫోకస్ చేసింది ఈ అమ్మడు. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ తో తాను చేసిన “దే దే ప్యార్ దే” శుక్రవారం నుండి విడుదల కానుంది.

ఐతే రకుల్ నటించిన ఓ సన్నివేశం పై సెన్సార్ బోర్డు అభ్యతరం తెలిపింది. ఈ మూవీ లోని ఓ పాటలో రకుల్ మద్యం సేవిస్తూ డాన్స్ చేసే సన్నివేశం తీసివేయడం కానీ కొన్ని మార్పులు చేయడం కానీ చేయవలసిందిగా సూచించింది. మందు బాటిల్ ప్లేసులో పూల తో గ్రాఫిక్ చేయమని చెప్పారంట సెన్సార్ సభ్యులు. పూల వాసన చూస్తూ తాగినట్లు డాన్స్ చేస్తే ప్రేక్షకులు రకుల్ ని చూసి ఆడియెన్స్ నవ్వుకుంటారో,జాలిపడతారో చూడాలి మరి.

సీనియర్ హీరోయిన్ టబు ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీని అకీవ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చినట్టు సమాచారం.

సంబంధిత సమాచారం :

More