‘సికందర్’ నిర్మాతలు లంచం ఇచ్చారా..?

‘సికందర్’ నిర్మాతలు లంచం ఇచ్చారా..?

Published on Aug 24, 2014 2:05 AM IST

Sikandar
సూర్య, సమంత జంటగా లింగుస్వామి దర్శకత్వం వహించిన సినిమా ‘అంజాన్’. తెలుగులో ‘సికందర్’గా విడుదలయింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చింది. క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ కోసం నిర్మాతలు లంచం ఇచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ముంబై సెన్సార్ బోర్డు సిఈఓ రాకేశ్ కుమార్ అరెస్టుతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. లాప్ టాప్, ఐఫోన్ లంచంగా తీసుకున్నట్టు దర్యాప్తు సంస్థ సిబిఐ ఆరోపిస్తుంది. తెలుగు వెర్షన్ స్క్రీనింగ్ కోసం మరో 50 వేల రూపాయలు అదనంగా రాకేశ్ తీసుకున్నారని సమాచారం.

‘సికందర్’ సినిమా ఫలితం పక్కన పెడితే ఆగస్ట్ 15న విడుదలయిన ఈ సినిమాలో సమంత ఒక రేంజ్లో అందాలు ఆరబోసింది. బికినీలో హాల్ చల్ చేసింది. మాఫియా గ్యాంగ్ స్టర్ గా నటించిన సూర్య చేసిన ఫైట్స్ లో హింస (వయిలెన్స్) కూడా ఎక్కువే. అటువంటి సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం పట్ల సినిమా ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు