హలో గురు.. క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ !

Published on Oct 15, 2018 4:18 pm IST

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’ సెన్సార్ పూర్తి చేసుకుంది.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ బోర్డు క్లీన్ ‘యూ ‘ సర్టిఫికేట్ ఇచ్చింది.

నేను లోకల్ ఫేమ్ త్రినాధరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించగా మరొక హీరోయిన్ ప్రణీత ముఖ్య పాత్రలో నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్ రాజు నిర్మించిన ఈచిత్రం అక్టోబర్ 18న విడుదలకానుంది.ఇక రామ్, అనుపమల కెమిస్ట్రీ ఈచిత్రానికి హైలైట్ కానుంది.

సంబంధిత సమాచారం :