చీకటి గదిలో చితక్కొట్టుడు డైరెక్టర్ కొత్త సినిమా ప్రారంభం !

Published on May 2, 2019 3:00 pm IST

సంతోష్ పి జయకుమార్ దర్శకత్వంలో అడల్ట్ హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన చిత్రం చీకటి గదిలో చితక్కొట్టుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యావరేజ్ గా ఆడింది. ఇక ఈ చిత్రం తరువాత సంతోష్ కోలీవుడ్ లో అరవింద స్వామి తో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం ఈరోజు లాంచ్ అయ్యింది.

మథియాలగాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సంతోష్ కు తమిళం లో ఇది నాల్గవ సినిమా. ఇంతుకుముందు ఆయన అరియల్ మురట్టు కుతకుతూ , గజినీకాంత్ , హార హర మాహాదేవికి సినిమాలు దర్శకత్వం వహించాడు. కాగా అరవింద స్వామి ఈ చిత్రం తోపాటు మరో రెండు తమిళ చిత్రాల్లో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More