చైతు “థాంక్యూ” పై ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Apr 19, 2021 1:12 am IST

వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా “థాంక్యూ” సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో చైతు ఒక ఎన్నారైగా నటిస్తున్నాడట. తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి ఇండియాకి రావడం, ఈ వచ్చే జర్నీలో ఈ సినిమా నేపథ్యం ఉంటుందని.. ఈ క్రమంలో చైతు పాత్ర తాలూకు ప్రయాణంలో జరిగే సంఘటనలు చాలా ఎమోషనల్ గా ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాలో హీరో పాత్ర చాలా ఇంటెన్సిటీతో కూడిన నటనతో ఉంటుందని టాక్.

అలాగే ఈ సినిమా కథ గురించి మరో రూమర్ కూడా బాగా వినిపిస్తోంది. ఓ మధ్యతరగతి అబ్బాయి ఒక తెలుగు అగ్ర కథానాయకుడికి పెద్ద అభిమాని, ఆ హీరో కోసం కటౌట్స్ కట్టే స్థాయి నుండి ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎలా మారాడు ? ఈ విజయ పథంలో తనకి సహకరించిన వారందరికీ అతను థాంక్స్ ఎలా చెప్పాలని నిర్ణయించుకున్నాడు ? ఈ క్రమంలో అతను ఎలాంటి అనుభవాలు పొందాడు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్ అట. మరి చూడాలి పై రెండు పాయింట్స్ లో ఈ సినిమా ఏ పాయింట్ కి సంబంధించి ఉంటుందో.

సంబంధిత సమాచారం :