చైతు లుక్ రిలీజ్ అవ్వలేదు !

చైతు లుక్ రిలీజ్ అవ్వలేదు !

Published on Jul 1, 2018 5:48 PM IST

Naga Chaithanya

అక్కినేని అభిమానులు నాగ చైతన్య నటిస్తున్న చిత్రాల ఫస్ట్ లుక్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . దాంట్లో ఒకటి ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇక ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్ ఇదేనంటూ ఈ రోజు కొందరు సోషల్ మీడియాలో ఒక పోస్టర్ ను వదిలారు .

ఆలా రిలీజ్ చేసిన కాసేపటికే ఆపిక్ వైరల్ అయింది .ఆ పోస్టర్ చూసిన చిత్ర యూనిట్ వెంటనే స్పందించింది . శైలజారెడ్డి అల్లుడు చిత్ర ఫస్ట్ లుక్ ను ఇంకా విడుదల చేయలేదు. సోషల్ మీడియాలో విడుదలైన పోస్టర్ ఫేక్ అని ఈ వారంలో ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని ట్వీట్ చేసింది.
మారుతీ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తుండగా , అను ఇమాన్యుయెల్ కథానాయిక పాత్రను పోషిస్తుంది . సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు .

తాజా వార్తలు