చైతు ‘లవ్ స్టోరీ’ లేటెస్ట్ అప్ డేట్ !

చైతు ‘లవ్ స్టోరీ’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Nov 28, 2020 11:02 PM IST

అక్కినేని నాగచైతన్య హీరోగా చేస్తోన్న ‘లవ్ స్టోరీ’ సినిమా తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రిలీజ్ కి రెడీగా ఉందట. ఈ రోజుతోటి ఆర్ఆర్ కి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ పూర్తయిందట. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడలి. ఇక శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత ఎలాంటి కథతో వస్తాడా అని అందరిలో ఆసక్తి ఉన్న సమయంలో ఆ ఆసక్తిని డబుల్ చేస్తూ చైతు – సాయిపల్లవి లాంటి క్రేజీ కాంబినేషన్ తో మరో వినూత్నమైన ప్రేమ కథను తీసుకురాబోతున్నాడు.

దీనికితోడు ఫిదాలో తన నటనతో ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుండటం.. అలాగే మజిలీ, వెంకీమామ లాంటి సూపర్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న నాగచైతన్య ఈ సినిమాలో హీరో కావడంతో ఈ సినిమా కోసం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పోటీ పడుతున్నాయి. ఆ మధ్య జీ5 ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ కూడా ఈ సినిమా భారీ మొత్తంలో ఆఫర్ చేస్తోన్నాయని వార్తలు వచ్చాయి. మరి రెడీ అయిన లవ్ స్టోరీ ఎప్పుదు రిలీజ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు