ఆ బ్యానర్ లో నాగ చైతన్య కన్ఫర్మే !

Published on Feb 25, 2019 8:28 am IST

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాలో నటిస్తోన్నాడు. అలాగే నిన్న టి నుండి ‘వెంకీ మామ’ షూట్ లో పాల్గొంటున్నాడు. కాగా చైతు మరో టాప్ బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో చైతు సినిమా చేయబోతున్నాడు. డిసెంబర్ నుంచి ఈ సినిమా మొదలు కానుందని సమాచారం.

అలాగే చైతు కోసం స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఓ మంచి లవ్ స్టోరీ రాస్తున్నారు. పాత ‘దేవదాస్’ కథ ఆధారంగా అంతటి గొప్ప విషాదాంతమైన ప్రేమ కథను చైతు కోసం రాశాడట విజయేంద్ర ప్రసాద్. ఇక ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మధ్య వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద కాస్త వెనుక పడిన చైతూకి శివ నిర్వాణ అన్నా ‘మజిలీ’తో మంచి హిట్ ఇస్తాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X