సల్మాన్‌ఖాన్‌పై చీటింగ్ కేసు.. కారణమేంటంటే?

Published on Jul 9, 2021 2:44 am IST


బాలీవుడ్ బాద్‌షా, కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌పై చీటింగ్ కేసు నమోదయ్యింది. చంఢీగడ్‌కు చెందిన అరుణ్‌ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు మేరకు సల్మాన్‌తో పాటు ఆయన సోదరి అల్విరా ఖాన్‌ అగ్నిహోత్రి, బీయింగ్‌ హ్యూమన్‌ ఫౌండేషన్‌కు చెందిన మరో ఏడుగురిపై కేసు నమోదు అయ్యింది. దీనిపై ఈ నెల 13వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేశారు. అసలు అరుణ్‌ గుప్తా ఫిర్యాదులో ఏముందంటే బీయింగ్ హ్యూమన్ సంస్థ ఉద్యోగులు నన్ను ఆ సంస్థ ఫ్రాంచైజీని తెరవమని కోరగా రూ.3 కోట్లు ఖర్చు పెట్టి తెరిచానని చెప్పుకొచ్చారు.

అయితే షోరూమ్ తెరిచి సంవత్సరం గడుస్తున్న తనకు సదరు సంస్థ నుంచి రావాల్సిన వస్త్రాలు ఏమీ రాలేదని పేర్కొన్నారు. అంతేకాదు బిగ్‌బాస్‌ సెట్లోకి సైతం పిలిచి షోరూమ్ ప్రారంభించేందుకు తాను వస్తానని సల్మాన్‌ఖాన్ హామీ ఇచ్చారని, కానీ ఆయన కూడా రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సల్మాన్‌తో పాటు ఆయన సోదరి అల్విరా, సంస్థ సీఈఓ ప్రకాశ్ కాపరే సహా మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత సమాచారం :