ప్రభాస్ కోసం మరొక దర్శకుడు సిద్ధం

Published on May 13, 2021 3:00 am IST

రెబల్ స్టార్ ప్రభాస్ కోసం ఎదురుచూసే దర్శకుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే చేస్తున్న ‘రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్’ కాకుండా నాగ్ అశ్విన్ చిత్రం, సిద్దార్థ్ ఆనంద్ చిత్రం ఉన్నాయి. ఈ రెండూ కంప్లీట్ కావడానికి ఇంకో ఏడాదిన్నర టైమ్ పట్టేలా ఉంది. వీటి తర్వాత మళ్ళీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తారనే టాక్ ఉంది. ఇవన్నీ పూర్తవ్వాలంటే రెండేళ్లు పట్టేలా ఉంది. ప్రభాస్ ఇంత బిజీగా ఉన్నా ఆయన కోసం కథలు రాసుకుంటున్న దర్శకుల లిస్ట్ పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ జాబితాలోకి చంద్రశేఖర్ ఏలేటి కూడ చేరారు.

ఇటీవల ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు ఆయన. ఏలేటి ప్రతి సినిమాలోనూ ఒక ప్రత్యేకత అనేది ఉంటూనే ఉంటుంది. అందుకే ప్రేక్షకులు ఆయన చిత్రాలంటే విశేషంగా చూస్తుంటారు. ఈయన ఇప్పుడు రెబల్ స్టార్ కోసం కథ రెడీ చేసే పనిలో ఉన్నారట. ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో ఉండాలనేది తప్పనిసరి నియమం అయిపోయింది. అందుకే ఏలేటి జాతీయస్థాయిలో వర్కవుట్ కాగల కథను సిద్ధం చేస్తున్నారట. కథ పూర్తికాగానే ఆయన ప్రభాస్ ను అప్రోచ్ అవుతారట. కథ నచ్చి ప్రభాస్ గనుక ఓకే చెప్తే ఎంత సమయమైనా ఎదురుచూడటానికి ఆయన సిద్ధంగా ఉన్నారట.

సంబంధిత సమాచారం :