మళ్ళీ తెరపై మెరవనున్న ‘చంటి’ జోడీ

Published on Feb 17, 2014 4:45 pm IST

Venkatesh-and-Meena
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ కానున్నాడు. విక్టరీ వెంకటేష్ కెరీర్లో ‘చంటి’ సినిమా బిగ్గెస్ట్ హిట్. ఆ సినిమాలో నటించిన వెంకీ – మీనా కాంబినేషన్ కి మంచి పేరు వచ్చింది. వీరిద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

మళ్ళీ చాలా కాలం తర్వాత వెంకటేష్, మీనా కలిసి ఓ తెలుగు సినిమాలో నటించనున్నారు. వెంకటేష్ మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ సినిమా రీమేక్ లో నటించనున్నాడు. ఈ సినిమాతో ఈ ఓల్డ్ పెయిర్ మళ్ళీ తెరపై కనువిందు చేయనుంది. శ్రీ ప్రియ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.

ఈ చిత్ర మళయాళ వెర్షన్ లో కూడా మీనా నటించింది. ఈ సినిమాలో మీనా కాకుండా నదియా కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

సంబంధిత సమాచారం :