‘హిట్ – 2’ పై మరింత హైప్ పెంచుతున్న క్యారెక్టర్ పోస్టర్స్

‘హిట్ – 2’ పై మరింత హైప్ పెంచుతున్న క్యారెక్టర్ పోస్టర్స్

Published on Nov 1, 2022 9:38 PM IST

శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హిట్ 2. ఇటీవల విశ్వక్ సేన్ తో శైలేష్ తెరకెక్కించిన హిట్ 1 మూవీ పెద్ద సక్సెస్ కొట్టడంతో హిట్ 2 పై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని, హీరో నాని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కృష్ణదేవ్ అలియాస్ కేడి అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు అడివి శేష్. యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా దర్శకుడు శైలేష్ కొలను ఈ మూవీని తెరకెక్కించారు.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ ప్రోమో అందరినీ ఆకట్టుకోగా నేడు ఈ సినిమా నుండి పలు ముఖ్య పాత్రధారుల యొక్క క్యారెక్టర్ పోస్టర్స్ ని వరుసగా రిలీజ్ చేసింది యూనిట్. హీరోయిన్ గా ఆర్య పాత్రలో మీనాక్షి చౌదరి, అడిషనల్ డిజిపి నాగేశ్వరరావు గా రావు రమేష్, వర్ష పాత్రలో కోమలి ప్రసాద్, అలానే అభిలాష్ పాత్రలో మాగంటి శ్రీనాథ్ ల క్యారెక్టర్ పోస్టర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పరిచాయి. ఇక హిట్ 2 మూవీ ఫస్ట్ లుక్ టీజర్ నవంబర్ 3 న విడుదల కానుండగా మూవీని డిసెంబర్ 2 న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు