మెగా స్టూడియోను నిర్మించాలనే ఆలోచనలో ఉన్న చరణ్ !

Published on Jul 1, 2018 8:34 pm IST


‘రంగస్థలం’ చిత్ర విజయం తో ఫుల్ జోష్ లో ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన 12వ చిత్రంలో నటిస్తున్నారు . ఇక ఆయన హీరోగానే కాకుండా కొణిదల ప్రొడక్షన్స్ ను స్థాపించి సినిమాలు కూడా నిర్మిస్తున్నారు . ఇక సినిమాలే గాక ఆయనకి ప్రైవేట్ వ్యాపారాలు కూడా వున్నాయి. ఇక ఇప్పుడు చరణ్ హైదరాబాద్ లో మెగా స్టూడియో ను నిర్మించాలనే ఆలోచనతో వున్నాడట . ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న సైరా సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ పరిసరాల్లో 22 ఎకరాల్లో భారీ సెట్ ను వేశారు. ఈ స్థలంలోనే మెగా స్టూడియోని కట్టాలని ప్లాన్ చేస్తున్నాడట చరణ్ .

కాగా నందమూరి కుటుంబానికి రామకృష్ణ స్టూడియోస్ , అలాగే అక్కినేని కుటుంబానికి అన్నపూర్ణ స్టూడియోస్ , దగ్గుబాటి కుటుంబానికి రామానాయుడు స్టూడియోస్ అలాగే ఘట్టమనేని కుటుంబానికి పద్మాలయ స్టూడియోస్ ఉన్నాయి . ఇప్పుడు చరణ్ తీసుకున్న ఈ నిర్ణయంతో మెగా కుటుంబానికి కూడా ఒక స్టూడియో ఉండబోతుంది అన్నమాట.

సంబంధిత సమాచారం :