తారక్ టీజర్ విషయంలో మైండ్ బ్లో చేసిన చరణ్.!

Published on Oct 21, 2020 12:57 pm IST

మాస్ ఆడియెన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు రాజమౌళి. మరి అలాంటి దర్శకుడు అదే మాస్ ఆడియెన్స్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు పవర్ ఫుల్ మాస్ హీరోలతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్నదే ఇండియన్ సినిమా వర్గాల్లో మతి పోగొట్టే అంశం. అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో ప్లాన్ చేసిన భారీ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”.

ఈ చిత్రం నుంచి ఇపుడు తారక్ అభిమానుల ఆకలి, నిరీక్షణ ఒక్కసారిగా తీరనుంది అని చెప్పాలి. కొన్ని నెలల కితం చరణ్ అభిమానులకు తారక్ గిఫ్ట్ ఇస్తే ఇప్పుడు అందుకు మరింత స్థాయిలో టన్నుల కొద్ది మాస్ ఎలిమెంట్స్ తో భీం టీజర్ ను చరణ్ విడుదల చేస్తున్నారు. దాని కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ చెప్పలేని స్థాయిలో ఎదురు చూస్తున్నారు.

ఇపుడు వారి అంచనాలకు మించి ఊహలకు అందని విధంగా చరణ్ టీజ్ చేస్తూ వదిలిన చిన్న వీడియో క్లిప్పింగ్ ను చూస్తే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. జస్ట్ కొమరం భీం గా తారక్ నీటిలో నుంచి ఈటె తీస్తున్న షాట్ పెట్టిన చరణ్ మరిన్ని స్థాయి అంచనాలు పెంచేసాడు. దీనితో రాజమౌళి ఏ రేంజ్ ఫీస్ట్ ప్లాన్ చేశారో మనం అర్ధం చేసుకోవచ్చు.

బ్రదర్ నీకోసం టీజ్ చేస్తూ ఒక గిఫ్ట్ ఉంది టైం కే ఇస్తా అంటూ చరణ్ పోస్ట్ చెయ్యగా దానికి తారక్, బ్రో ఇప్పటికే 5 నెలలు లేట్ అయ్యింది అలాగే అక్కడ జక్కనతో డీల్ చేస్తున్నావ్ జాగ్రత్త అని ఫన్నీ రిప్లై ఇచ్చారు. ఇవి పక్కన పెడితే చరణ్ వదిలిన క్లిప్పింగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. మరి ఈ పవర్ ప్యాకెడ్ టీజర్ ఎలా ఉండనుందో తెలియాలి అంటే రేపటి వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :

More