ఏప్రిల్ 2 నుండి సెట్లో సందడి చేయనున్న రామ్ చరణ్

ఏప్రిల్ 2 నుండి సెట్లో సందడి చేయనున్న రామ్ చరణ్

Published on Mar 18, 2015 3:46 PM IST

ram-charan-srinu-vaitla
‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్దమవుతున్నాడు. రామ్ చరణ్ విలక్షణ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో చేయనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 16న హైదరబాద్ లో మొదలైంది. మరి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కేవలం రెండు రోజులు మాత్రమే జరిగింది. ఇందులో ఈ సినిమాలో వచ్చే పలువురు ప్రముఖ నటులపై కొన్ని సన్నివేశాలను షూట్ చేసారు.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మరియు సెకండ్ షెడ్యూల్ ఏప్రిల్ 2న మొదలు కానుంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ పాల్గొంటాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తన బెంగుళూరు ఫాం హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే శ్రీనువైట్ల సినిమాలో కామెడీ టచ్ ఉన్న పాత్ర చేస్తుండడంతో దానికోసం కూడా కసరత్తులు చేస్తున్నాడు. మళ్ళీ శ్రీను వైట్ల – కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి చేస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించనున్న ఈ మూవీకి తమిళ్ టాప్ లిస్టు లో ఉన్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు