చరణ్ అప్పుడే డిసైడ్ అవుతాడట.!

Published on Oct 18, 2020 2:03 pm IST

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఊహించని విధంగా రెండు భారీ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకటి దర్శక ధీరుడు రాజమౌళితో తీస్తున్న “రౌద్రం రణం రుధిరం” కాగా మరొకటి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరుతో తెరకెక్కిస్తున్న “ఆచార్య”. ఈ రెండు భారీ చిత్రాల్లో చరణ్ ఇప్పుడు నటిస్తున్నాడు.

అయితే ఇవి ప్రస్తుతం షూట్ దశలో ఉన్నాయి కానీ చరణ్ మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో ఇంకా మౌనం గానే ఉన్నారు. చరణ్ తో మిగతా స్టార్ హీరోలు అంతా ఒక సినిమా చేస్తున్న సమయంలోనే మరో సినిమాను లైన్ లో పెట్టేసుకున్నారు. కానీ చరణ్ మాత్రం ఇంకా ఏ సినిమానూ కమిట్ కాలేదు.

దీనితో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. అయితే ఇపుడు లేటెస్ట్ టాక్ ప్రకారం చరణ్ ముందు పూర్తిగా ఈ రెండు సినిమాల మీదనే దృష్టి పెట్టాలి అనుకుంటున్నాడు. ఒక్కసారి ఈ రెండు భారీ చిత్రాలు పూర్తయ్యిపోయాక కొత్త సినిమాను ఓకే చెయ్యాలని అనుకుంటున్నాడట. మరి చరణ్ తన నెక్స్ట్ కు ఎవరిని డిసైడ్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More