అమెరికాలో అభిమానులతో కలసి, వారి మధ్య ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా చూడాలని రామ్ చరణ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సోమవారం హైదరాబాద్ నగరంలో గల యుఎస్ఏ కాన్సులేట్ కార్యాలయానికి రామ్ చరణ్ వెళ్ళారు. వీసా వర్క్స్ కంప్లీట్ అయితే.. ‘గోవిందుడు..’ రిలీజ్ అయిన వీకెండ్ లో చరణ్ యుఎస్ఏ వెళ్తారు. అక్కడ అభిమానులతో కలసి సినిమా చూస్తారని సమాచారం. అక్టోబర్ 1న యుఎస్ లో సుమారు 154 లొకేషన్స్ లలో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 30న ప్రిమియర్ షోలకు సర్వం సిద్దమయింది.
ఇప్పటివరకు యాక్షన్ ఎంటర్టైనర్స్ తో భారి విజయాలు అందుకున్న చరణ్ తొలిసారిగా పూర్తి స్థాయి కుటుంబ కథాచిత్రంలో నటించాడు. కృష్ణవంశి సినిమా తెరకెక్కించిన తీరు పట్ల చరణ్ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలిని ముఖర్జీ ముఖ్య పాత్రలలో నటించిన ఈ సినిమాను బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మించారు. యువన్ శంకర్ రాజ సంగీత దర్శకుడు.


