కొరటాల దర్శకత్వంలో చిరు డ్యూయల్ రోల్ !

కొరటాల దర్శకత్వంలో చిరు డ్యూయల్ రోల్ !

Published on Jul 14, 2018 6:59 PM IST

koratala1

కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి తన 152వ చిత్రంలో నటించనున్నారని తెలిసిందే. ప్రస్తుతం కొరటాల ఈ సినిమా కు సంభందించిన స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారట. ఇక ఈసినిమా లో చిరు రెండు పాత్రల్లో నటించనున్నారట అందులో ఒక పాత్రలో అయన రైతు గా కనిపించనున్నారని సమాచారం . సందేశాత్మకమైన చిత్రాలకు వాణిజ్య అంశాలను జోడించి వరుస బ్లాక్ బ్లస్టర్లను సొంతంచేసుకున్న కొరటాల శివ ఈ చిత్రాన్ని కూడా అదే ఫార్ములా తో తెరకెక్కించనున్నారట . త్వరలోనే ఈ చిత్రంగురించి అధికారిక ప్రకటన వెలుబడే అవకాశాలు ఉన్నాయి.

ఇక ప్రస్తుతం చిరు స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న’సైరా’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ఆయన కొరటాల దర్శకత్వంలో నటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు