ఏ సినీ ఇండస్ట్రీలో అయిన ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అయ్యింది అంటే ఆ సినిమాపై అభిమానుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొంటాయి. అలాగే సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కి మ్కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి క్రేజ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శ్రీను వైట్ల సినిమాకి నెలకొంది. ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని సెకండ్ షెడ్యూల్ స్పెయిన్ లో చేస్తోంది. అక్కడ రామ్ చరణ్ – రకుల్ ప్రీత్ లపై రెండు పాటలను షూట్ చేస్తున్నారు.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ బాగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ మరియు సీడెడ్ రైట్స్ ని భారీ మొత్తానికి అమ్ముడు చేసినట్లు సమాచారం. ఈ విషయంలో నిర్మాత దివివ్ దానయ్య చాలా హ్యాపీగా ఉన్నాడు. మిగతా ఏరియాలకి సంబందించిన రైట్స్ కి సంబందించిన డిష్కషన్స్ కూడా జరుగుతున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. కృతి కర్బంద, నదియాలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


