
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యాక్షన్ కామెడీ స్పెషలిస్ట్ అయిన శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. అక్కడ రామ్ చరణ్ – రకుల్ ప్రీత్ సింగ్ పై వచ్చే రెండు సాంగ్స్ ని షూట్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ మొదటి సారి హరన్ తో జోడీ కడుతోంది. స్పెయిన్ లో మునుపెన్నడూ చూడని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఈ సాంగ్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ పాటల్లో రామ్ చరణ్ స్పెషల్ డాన్సింగ్ మూవ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడని సమాచారం.
స్పెయిన్ నుంచి తిరిగి వచ్చాక హైదరాబాద్ లో ఈ సినిమాకి చెందిన ఓ మేజర్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. అందుకోసమే డిఫరెంట్ యాక్షన్ స్టంట్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథని అందించారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి కర్బంద, నదియాలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

