
చార్మింగ్ గర్ల్ చార్మి తన అధికారిక వెబ్ సైట్ ని ఈరోజు ప్రారంభించడానికి సిద్దంగా వుంది. ఈ బబ్లీ బ్యూటీ టాలీవుడ్ లో తన కీర్తిని తిరిగి సంపాదించుకోవడానికి తెగ కష్టపడుతుంది. తన చివరిగా నటించిన ‘ప్రతిఘటన’ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరగా ఇప్పుడు మంత్ర 2 కోసం ఎంతో కష్టపడుతుంది.
ఇదిలావుండగా “హలో ఫ్రెండ్స్ నా అధికారిక వెబ్ సైట్ http://charmmekaur.com ని ఈరోజు రాత్రి ఏడు గంటలకు ప్రారంభిస్తున్నాను ఇక వెయిటింగ్ అయిపొయింది. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను” అని తన అభిమానులకు తెలిపింది.
ఎన్నో కమర్షియల్ చిత్రాలతో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలో చార్మి నటించింది. ‘మంత్ర’ ‘అనుకోకుండా ఒక రోజు’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించాయి. చార్మి హిందీలో అమితాబ్ సరసన పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘బుడ్డా హోగా తేరా బాప్’ చిత్రంలో నటించింది.