చార్మీ ప్రొడ్యూసర్‌గా.. దేవీశ్రీ హీరోగా సినిమా?

Published on Jul 1, 2021 3:03 am IST


సంగీత ప్రపంచంలో ఎన్నో హిట్లు అందుకుని, ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఓ సినిమా ప్రారంభమైనప్పటికీ, అది పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. అయితే చాలా రోజుల తర్వాతా దేవిశ్రీ మరోసారి హీరోగా మారి ఓ సినిమాను చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇది సాధారణ సినిమా కాదని హర్రర్ డ్రామాగా ఉండబోతుందని టాక్. ఇకపోతే ప్రఖ్యాత కథానాయిక చార్మీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని తెలుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పట్టికి ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :