వర్మ విషయంలో అన్నంత పని చేసిన ఛార్మి.

Published on Jul 20, 2019 9:33 pm IST

దర్శకుడు వర్మ చర్యలు ఎప్పుడూ సంచలనమే. కొద్దిసేపటి క్రితం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో చూస్తుంటే ఎవ్వరికైనా ఆశ్చర్య వేయకమానదు. ఈ వీడియోలో షాంపేన్ ను తలపై పోసుకున్న వర్మ,నిర్మాతలైన పూరి ,ఛార్మీలను గుండెలకు హత్తుకున్నాడు. “ఇస్మార్ట్ శంకర్” సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా గత రాత్రి చిత్ర యూనిట్ సభ్యులందరూ ఓ హోటల్ లో పార్టీ జరుపుకున్నారు. ఆ సందర్భంలో జరిగిన సన్నివేశానికి సంబందించిన వీడియో వర్మ పోస్ట్ చేయడంతో పాటు, నేను పిచ్చివాడిని కాను,ఇస్మార్ట్ శంకర్ నన్ను పిచ్చివాడిని చేసింది” అని కామెంట్ కూడా పెట్టారు.

ఈ మూవీ నిర్మాత అయిన నటి ఛార్మి మూవీ విజయం తరువాత వర్మను షాంపేన్ లో ముంచుతా అన్నారు. చెప్పిన విధంగా ఛార్మి వర్మకు పెద్ద పార్టీ ఇచ్చినట్టున్నారు. కాగా ఇస్మార్ట్ శంకర్ మొదటి రెండు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 25కోట్ల షేర్ సాధించింది.

సంబంధిత సమాచారం :