
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ను త్వరగా పెళ్లి చేసుకోవలసిన బ్రహ్మచారుల లిస్టులో ముందు ఉంటారని హీరోయిన్ ఛార్మి వ్యాఖ్యానించారు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘కొంచం టచ్ లో ఉంటే చెప్తా’ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
యంగ్ బ్యాచిలర్ గా ఉన్నది ఇక చాలు. పెళ్లి చేసుకుంటే బెటర్ , బోలెడు మంది అమ్మాయిలు బయట వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరి పెళ్ళిళ్ళు అయ్యిపోయాయి. మీ పెళ్లి కోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు. మంచి అమ్మాయిని చూసి అమ్మానాన్నల వద్దకు తీసుకెళ్ళి పెళ్లి చేసుకోండి. అని ఛార్మి చెప్పారు.
ఇలియానాను మేకప్ లేకుండా చూడలేమంటూ, ఆమెకు నటనలో క్రాష్ కోర్స్ అవసరం అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘రాఖి’ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య వివాదం జరిగిందని అప్పట్లో వచ్చిన వార్తలకు తాజా వ్యాఖ్యలు బలం చేకూర్చాయి.