జ్యోతిలక్ష్మీ ని సత్కరించిన వంశీ ఫిల్మ్ సొసైటీ

Jyothilakshmi
లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా పేరు తెచ్చుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో హాట్ బ్యూటీ ఛార్మీ కూడా ఒకరు. ఛార్మీ నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘జ్యోతిలక్ష్మీ’. ఈ సినిమా రెండు వారల క్రితం రిలీజ్ అవ్వడమే కాకుండా మహిళా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనతో పాటు మరియు సపోర్ట్ కూడా చేసారు. మహిళలకు అండగా నిలిచే ఓ మంచి సినిమా తీసిన కారణంగా వంశీ ఫిల్మ్ సొసైటీ వారు ఛార్మీని సత్కరించారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ సత్కార సభకి పలువురు సినీ ప్రముఖుల తో పాటు కొందరు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఈ వేడుకలో ఛార్మీ మాట్లాడుతూ ‘తనకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు అందరికీ థాంక్స్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జ్యోతిలక్ష్మీ అని పిలుస్తున్నారు. ముందుగా ఒక మహిళ మరో మహిళకి గొరవం ఇవ్వాలి అప్పుడే ఇతరులు మహిళలకు గౌరవం ఇవ్వడం మొదలు పెడతారని’ తెలిపింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. సి. కళ్యాణ్ ఈ సినిమాని నిర్మించాడు.

Exit mobile version