వర్మను వోడ్కాలో ముంచుతానంటున్న ఛార్మి

Published on Jul 16, 2019 9:10 pm IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది. ఊహించిన స్థాయి కంటే ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే నెలకొన్నాయి. ఫలితంగా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. దీంతో చిత్ర నిర్మాతలు ఛార్మి చాలా హ్యాపీగా ఉన్నారు.

ఆమె ఆనందాన్ని రెట్టింపు చేసేలా స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమా గురించి పాజిటివ్ ట్వీట్స్ చేస్తున్నారు. ఈసారి పూరి హిట్ కొట్టడం ఖాయమని, అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. దీంతో ఛార్మి మిమ్మల్ని మిస్సవుతున్నాం సర్.. మీరు త్వరగా వస్తే మిమ్మల్ని వోడ్కాలో ముంచేస్తాం అంటూ సమాధానమిచ్చారు. మరోవైపు పూరి సైతం ఈసారి సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. తప్పకుండా విజయాన్ని అందుకుంటాననే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More