‘ఇస్మార్ట్ శంకర్’కు ‘ఏ’ సర్టిఫికెట్..కాబట్టి హిట్ అంటున్న ఛార్మి

Published on Jul 15, 2019 11:29 pm IST

ఈ నెల 18న విడుదలకానున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి వచ్చినంత హైప్ ఈమధ్య కాలంలో పూరి సినిమాల్లో వేటికీ రాలేదు. కారణం సినిమాలోని మాస్ కంటెంట్. అదే ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయింది. అలాగే సెన్సార్ బోర్డు సభ్యులకు కూడా. అందుకే సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారు.

ఈ సంగతినే చెబుతూ గతంలో కూడా పూరి రూపొందించిన ‘దేశముదురు, పోకిరి, బిజినెస్ మేన్’ లాంటి సినిమాలకు సెన్సార్ బోర్డ్ ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఆ మూడు చిత్రాలు భారీ హిట్లుగా నిలిచాయి. కాబట్టి ఇప్పుడు ‘ఏ’ సర్టిఫికెట్ అందుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సైతం అదే స్థాయిలో విజయాన్ని సాదిస్తుందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి అభిప్రాయపడుతున్నారు. మరి ఆమె నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో ఈ గురువారం తేలిపోనుంది.

సంబంధిత సమాచారం :

X
More