వరుణ్ తేజ్ “ఘని” నుండి చార్ట్ బస్టర్ సిద్దం!?

Published on Aug 14, 2021 12:30 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఘని. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. వరుస బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఇస్తున్న థమన్ ఈ చిత్రం లో కూడా సూపర్ హిట్ సాంగ్స్ ను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం నుండి ఒక పాటను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమైనట్లు తెలుస్తోంది.

ప్రముఖ రచయిత రామ జోగయ్య శాస్త్రి ఈ చిత్రం కోసం పాట రాస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సూపర్ డూపర్ పెప్పి నంబర్ అంటూ చెప్పుకొచ్చారు. ఇది మరొక చార్ట్ బస్టర్ పాట అవుతుంది, నమ్మండి అంటూ చెప్పుకొచ్చారు. వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటిస్తుండగా, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :