ఉత్కంఠభరితంగా “చతుర్ ముఖం” ట్రైలర్..!

Published on Aug 10, 2021 8:30 pm IST

ఈ మధ్య కాలంలో మలయాళ చిత్రాలు తెలుగులో బాగా రీమేక్ అవుతున్నాయి. మంజు వారియర్‌, సన్నీ వెనె, శ్రీకాంత్‌ మురళి ప్రధానపాత్రలు పోషించిన ‘చతుర్ ముఖం’ చిత్రానికి మలయాళంలో మంచి ఆదరణ లభించింది. రంజిత్ కామ‌ల శంక‌ర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన్న ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ డబ్ మూవీ తెలుగు ఓటీటీ ఆహాలో ఈ నెల 13న విడుదల కాబోతుంది. తాజాగా ఈ డబ్ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను ఆహా యూట్యూబ్ వేదికగా పంచుకుంది.

అయితే ట్రైలర్ విషయానికి వస్తే లైఫ్‌లో ఒక అమ్మాయికి కావాల్సినవి విద్యాబ్యాసం, ఫెనాన్షియల్ స్టెబిలిటీ ఈ రెండు ఉన్నప్పుడే పెళ్లికి స్కోప్ ఉంటుందని ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆ తర్వాత ఏదో కనిపించని శక్తి ఒక అమ్మాయిని వెంటాడడం, హారర్ర్ సన్నివేశాలను తలపించేలా ఉత్కంఠభరితంగా సాగింది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :