
‘చీకటి రాజ్యం’.. ప్రయోగాలకు పెట్టింది పేరైన కమల్ హాసన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ప్రయోగాత్మక సినిమా. ఒకే ఒక్కరాత్రి జరిగే సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ‘తూంగవనం’ పేరుతో తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘చీకటి రాజ్యం’ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను గత కొద్దిసేపటి క్రితం చెన్నైలో విడుదల చేశారు. సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, త్రిషలతో పాటు ఇతర యూనిట్ సభ్యుల సమక్షంలో తెలుగు, తమిళ ట్రైలర్లను కమల్ హాసన్ ఒకేసారి విడుదల చేశారు.
కమల్ హాసన్ హీరోగా చేసిన పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రాజేష్ ఎమ్ సెల్వ ఈ రేసీ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించారు. నేడు విడుదల చేసిన ట్రైలర్ ద్వారా సినిమా ఏ రేంజ్లో ఉండనుందనే విషయాన్ని తెలియజేసినట్లైంది. రాజేష్ సూపర్బ్ టేకింగ్ ఈ ట్రైలర్లో అడుగడుగునా హైలైట్ అవుతూ వచ్చింది. ఈ సినిమాలో కమల్ హాసన్ నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు.
ప్రకాష్ రాజ్, సంపత్, త్రిష.. ఈ నాలుగు పాత్రలు ట్రైలర్లో హైలైట్‌గా కనిపిస్తున్నాయి. ఇక ఉత్తమ విలన్ దగ్గర్నుంచి స్వయంగా డబ్బింగ్ చెప్పడం పారంభించిన కమల్, “వాడి షర్ట్ కొంచెం నలిగినా చంపేస్తా. నేను చెప్తే చేస్తా” అంటూ చెప్పిన డైలాగ్ బాగుంది. ఓ సస్పెన్స్ ఎలిమెంట్/క్రైమ్ చుట్టూ తిరిగే కథగా కనిపిస్తున్న ఈ సినిమాకు గిబ్రాన్ ట్రైలర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్న విషయాన్ని ట్రైలర్ బలపరిచేలా ఉంది. గిబ్రాన్ తనదైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కట్టిపడేశారనే చెప్పాలి. దీపావళికి ఈ సినిమా విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

