మహా సముద్రం నుండి “చెప్పకే చెప్పకే” సెప్టెంబర్ 6 న విడుదల!

Published on Sep 3, 2021 10:37 pm IST


అజయ్ భూపతి దర్శకత్వం లో శర్వానంద్ హీరో గా అదితి రావు హైదరి హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం మహా సముద్రం. ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్లు విడుదల అయి సినిమా పై మరింత ఆసక్తి పెంచేలా చేస్తున్నాయి. ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ సింగిల్ కి ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ విడుదల కి చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది.

ఈ చిత్రం నుండి చెప్పకే చెప్పకే అనే పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 6 వ తేదీన ఈ పాటను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అక్టోబర్ 14 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :