ఓటిటి రివ్యూ : “ఛలాంగ్” – హిందీ చిత్రం(అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం)

ఓటిటి రివ్యూ : “ఛలాంగ్” – హిందీ చిత్రం(అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం)

Published on Nov 17, 2020 2:03 PM IST

నటీనటులు: రాజ్‌ కుమార్ రావ్, నుష్రత్ భరుచ, మహ్మద్ జీషన్ అయూబ్, సౌరభ్ శుక్లా

దర్శకత్వం: హన్సాల్ మెహతా

నిర్మాతలు: అజయ్ దేవ్‌గన్, లూవ్ రంజన్, అంకూర్ గార్గ్, భూషణ్ కుమార్

సంగీతం: హితేష్ సోనిక్

ఛాయాగ్రహణం: ఈషిత్ నరేన్

ఎడిట్ చేసినవారు: అకివ్ అలీ, చేతన్ సోలంకి

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న చిత్రం “ఛలాంగ్”. స్ట్రీమింగ్ యాప్ “అమెజాన్ ప్రైమ్ వీడియో”లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

కథ :

తన లైఫ్ మీద ఏమాత్రం సీరియస్ నెస్ లేని యువకుడు మంటు(రాజ్ కుమార్ రావ్) తన తండ్రి రికమెండేషన్ వల్ల ఓ స్కూల్ లో పి టి టీచర్ గా పని చెయ్యాల్సి వస్తుంది. అలాగే అదే స్కూల్ లో నుష్రత్ భరూచా ఒక కంప్యూటర్ టీచర్ గా పనిచేస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఆ స్కూల్ ప్రిన్సీ మరో బెటర్ పి టి టీచర్ ను అపాయింట్ చెయ్యాలని చూస్తారు. అలా కొత్త టీచర్ (జషీన్ సిద్ధిక్)ను నియమించాక మంటు స్టోరీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరి తన లైఫ్ లోకి వచ్చిన కొత్త కాంపిటీటర్ తో అసలు సీరియస్ నెస్ కనబర్చని మంటు ఎలా ఎదుర్కొన్నాడు? లాస్ట్ కు ఏం జరిగింది అన్నది అసలు కథ.

ఏమి బాగుంది?

ముందుగా రాజ్ కుమార్ రావ్ రోల్ విషయానికి వస్తే ఇలాంటి రోల్స్ లో ఇతడు సూపర్బ్ గా చేస్తాడని మరో సారి ప్రూవ్ అయ్యింది. అన్ని రకాల ఎమోషన్స్ అండ్ షేడ్స్ ను రాజ్ కుమార్ ఈ రోల్ లో చూపిస్తాడు. అలాగే పి టి టీచర్ గా తన కామికల్ టైమింగ్ గాని లుక్స్ కానీ ఇంప్రెసివ్ గా ఉంటాయి. ఇక ఇదిలా ఉంటే హీరోనే నుష్రత్ భరూచాతో కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఇక నుష్రత్ భరూచా కొన్ని సీన్స్ లో బాగ కనిపిస్తుంది.

ఇక ఇతర సపోర్టింగ్ రోల్స్ లో కనిపించిన సతీష్ కౌశిక్ అలాగే సభ శుక్లా మంచి పెర్ఫామెన్స్ ను ఇచ్చారు. అలాగే సినిమాలోని కథనం కానీ కొన్ని పాత్రల్లో చూపిన సింపుల్ రియాలిటీ కానీ చాలా సహజంగా అనిపిస్తాయి. అలాగే స్కూల్ లో చూపే కొన్ని ఎపిసోడ్స్ వాటిని చూపే డీటెయిల్స్ బాగా క్లీయర్ గా అనిపిస్తాయి. అలాగే సంగీతం పర్వాలేదనిపించినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది.

ఏం బాలేదు?

ఈ చిత్రంలో బాగా ఎగ్జైట్ అనిపించే అంశాలు పెద్దగా ఏమి ఉండవు. దానికి మెయిన్ కారణం అలాంటి సీన్స్ వచ్చే ట్విస్టులు లాంటివి ఏమి లేకపోవడమే. అందుకే ఈ సినిమా కాస్త సింపుల్ గానే అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ ను కూడా ఇంకా ఆసక్తికరంగా మలచి ఉంటే బాగుండేది. ఇంకా ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా కాబట్టి వాటికి సంబంధించి మరింత ఆసక్తికరంగా తెరకెక్కించాల్సింది. అలాగే మరో కీ రోల్ కు తీసుకున్న జీషన్ కూడా అంతగా ఎలివేట్ అయ్యినట్టు అనిపించదు. అలాగే సినిమా కూడా అక్కడక్కడా స్లో ఉన్నట్టు అనిపిస్తుంది.

తీర్పు :

ఇక మొత్తంగా చూస్కుంటే “ఛలాంగ్” ఒక రొటీన్ గా అనిపించే స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. అలా సింపుల్ గా సాగిపోయే చిత్రం ఇది. కానీ నటీనటుల నటన మాత్రం సూపర్బ్ గా అనిపిస్తాయి. కథనం కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. కాస్త అటు ఇటు అయినా ఓకే స్పోర్ట్స్ డ్రామా చూడాలి అనుకుంటే మాత్రం “ఛలాంగ్” ను కూడా ఒక్కసారికి అంటే లుక్కేయ్యొచ్చు.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు