‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘పులిజూదం’ కృష్ణా లేటెస్ట్ కలెక్షన్స్ !

‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘పులిజూదం’ కృష్ణా లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Mar 23, 2019 12:27 PM IST

సంతోష్ పి జయకుమార్ దర్శకత్వంలో ఆదిత్ – నిక్కీ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. యూత్ మైండ్ సెట్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ చిత్రం నెగిటివ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద రెవిన్యూని రాబట్టడంలో వెనుక పడింది. శుక్రవారం నాటికి కృష్ణా జిల్లాలో 4.08 లక్షల రూపాయలను వసూళ్లను సాధించింది. మొత్తం 2 రోజులగానూ కృష్ణా జిల్లాలో 9.88 లక్షల రూపాయలను రాబట్టింది.

అలాగే మరో చిత్రం విషయానికి వస్తే.. ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ్ యాక్షన్ హీరో విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘పులిజూదం’. ఈ చిత్రం సగటు సమీక్షలను అందుకుంది. రెండో రోజు నాటికి ఈ చిత్రం కృష్ణా జిల్లాలో 2.22 లక్షల రూపాయలను వసూళ్లను సాధించింది. మొత్తం 2 రోజులగానూ కృష్ణా జిల్లాలో 5 లక్షల రూపాయలను రాబట్టింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు