‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘పులిజూదం’ కృష్ణా లేటెస్ట్ కలెక్షన్స్ ..!

Published on Mar 25, 2019 9:56 am IST

సంతోష్ పి జయకుమార్ దర్శకత్వంలో ఆదిత్ – నిక్కీ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. యూత్ మైండ్ సెట్‌ని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ చిత్రం నెగిటివ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద రెవిన్యూని రాబట్టడంలో వెనుక పడింది. అయితే కృష్ణా జిల్లాలో ఆదివారం నాడు 3.81 లక్షల రూపాయలను వసూళ్లను సాధించింది. ఈ సినిమా మొదటి వారాంతంలో కృష్ణా జిల్లాలో మొత్తం 16.53 లక్షల రూపాయల షేర్ న రాబట్టింది.

అలాగే మరో చిత్రం విషయానికి వస్తే.. ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ్ యాక్షన్ హీరో విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘పులిజూదం’. ఈ చిత్రం సగటు సమీక్షలను అందుకుంది. కానీ ఆదివారం కృష్ణ జిల్లాలో ఈ చిత్రం రూ. 2.51 లక్షల రూపాయలను వసూళ్లను సాధించింది. మొత్తం 4 రోజులగానూ కృష్ణా జిల్లాలో 9.96 లక్షల షేర్ ను రాబట్టింది.

సంబంధిత సమాచారం :

More