‘వినవయ్యా రామయ్య’తో హీరోగా పరిచయమవుతున్న నాగ అన్వేష్.

‘వినవయ్యా రామయ్య’తో హీరోగా పరిచయమవుతున్న నాగ అన్వేష్.

Published on Nov 4, 2014 8:41 PM IST

Vinayya-Ramayya12
‘సింధూర పువ్వు’ వంటి క్లాసికాల్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత కృష్ణారెడ్డి తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ‘వినవయ్యా రామయ్య’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాగ అన్వేష్. ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మనల్ని అలరించడానికి రెడీ అయ్యాడు. బాల నటుడిగా ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో వెంకటేష్ తనయుడిగా నాగ అన్వేష్ నటించి మెప్పించాడు. ప్రస్తుతం నాగ అన్వేష్ ను చూసిన ఇండస్ట్రీ ప్రముఖులు భవిష్యత్ లో మంచి హీరో అయ్యే అర్హతలు ఈ కుర్రాడిలో ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ సినిమా ప్రారంభోత్సవం భుదవారం ఉదయం 10.40 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో గల రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతుంది. ‘చిరునవ్వుతో’ ఫేం జి.రామ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అగ్ర టెక్నీషియన్లు పని చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్. సరస్వతి ఫిల్మ్స్ పతాకంపై ‘సింధూర పువ్వు’ కృష్ణారెడ్డి ‘వినవయ్యా రామయ్య’ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు