వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీద సినిమాలు చేస్తున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ‘ చిన్నదాన నీ కోసం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర టీం ఓ లాంగ్ షెడ్యూల్ కోసం బార్సెలోన వెళ్ళిన సంగతి తెలిసిందే.. ఈ 35 రోజుల లాంగ్ షెడ్యూల్ చివరి దశకు చేరుకుంది. అంతే కాకుండా ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ 90% పూర్తవుతుంది. ఈ చిత్ర టీం బార్సెలోనా నుంచి తిరిగి రాగానే మిగిలి ఉన్న ఒక్క పాటని మరియు కొంత టాకీ పార్ట్ ని ఫినిష్ చేస్తారు.
నిన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. దానికి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. లవ్ ఎంటర్టైనర్స్ చేయడంలో మంచి పేరున్న కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన బాలీవుడ్ భామ మిస్తి హీరోయిన్ గా నటిస్తోంది. నితిన్ హోం బ్యానర్ అయిన శ్రేష్ఠ్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కరుణాకరన్ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ని కూడా మిక్స్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.


