ఇండియన్ సినీ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 2026లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి రెండు స్థానాల్లో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. మొదట చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
ఆ తర్వాత కొన్ని నెలలకే రామ్ చరణ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’తో వచ్చి తండ్రి రికార్డును బ్రేక్ చేశాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ కలెక్షన్లను అధిగమించి, ప్రస్తుతం రూ.400 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతూ 2026 సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ ఛాంపియన్‌గా నిలిచింది.
ఒకే సంవత్సరంలో తండ్రీకొడుకులు బాక్సాఫీస్ వద్ద టాప్ 2 స్థానాలను ఆక్రమించడం ఒక అరుదైన మైలురాయి. నిరాశపరిచిన సమ్మర్ సీజన్ తర్వాత టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ‘పెద్ది’ చిత్రం భారీ ఊరటనిస్తూ, 2026ని ఒక మెగా ఇయర్‌గా మార్చేసింది.


