మెగాస్టార్ ఫ్యాన్స్ కి భారీ ట్రీట్..!

మెగాస్టార్ ఫ్యాన్స్ కి భారీ ట్రీట్..!

Published on Apr 29, 2020 2:14 PM IST

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఇంటర్నేషనల్ డాన్స్ డే సంధర్భంగా ఓ ఆకస్మిక ప్రకటన చేశారు. ఆయన నేడు సాయంత్రం ఈ మధ్య చేసిన డాన్స్ పెరఫార్మెన్సుకి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తా అని వీడియో సందేశం పంపారు. ఇక తన ఎదుగుదలలో, కోట్లాది మంది అభిమానులను సంపాదించడంలో డాన్స్ కీలకపాత్ర పోషించింది అన్నారు. ఇప్పుడు కూడా తన ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏకైక మార్గం డాన్స్ అని చిరంజీవి తెలియజేశారు.

మరి సాయంత్రం చిరంజీవి విడుదల చేయనున్న ఆ డాన్స్ క్లిప్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో ఆయన చేస్తున్న ఆచార్య మూవీ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆచార్య మూవీలో చరణ్ కీలక రోల్ చేస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

తాజా వార్తలు