చిరు,బాలయ్య ఇద్దరినీ వాడేస్తున్న కార్తీ.

Published on May 27, 2019 2:21 pm IST

మెగా స్టార్ చిరంజీవి ని హీరోగా నిలబెట్టిన చిత్రం “ఖైదీ”. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పటివరకూ ఉన్న తెలుగు సినిమా రికార్డులను తిరగరాసి చిరంజీవిని సూపర్ స్టార్ ని చేసింది. ఇప్పుడు ఆ సూపర్ సక్సెస్ టైటిల్ ని తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న కార్తీ ప్రయోగాత్మక మూవీ కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. కథనం మొత్తం రాత్రి వేళలలో నడిచే ఈ మూవీ ని లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు.

తాజాగా ప్రకటించి కార్తీ కొత్త మూవీ కి బాలయ్య టైటిల్ నిర్ణయించారు. బాలకృష్ణ,కృష్ణ, కృష్ణమరాజు కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ “సుల్తాన్” టైటిల్ ఇప్పుడు కార్తీ మూవీకి ఫిక్స్ చేసారంట. డ్యూయల్ రోల్ చేసిన బాలయ్య ఒక రోల్ లో నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తారు ఈ మూవీలో. కార్తీ, రష్మిక హీరోహీరోయిన్లుగా డ్రీమ్ వారియర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తుండగా, రెమో ఫేమ్ భాగ్య రాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇలా హీరో కార్తీక్ చిరు,బాలయ్య లకు చిరస్మరణీయ విజయాలు అందించిన టైటిల్స్ వాడేసుకొని, వాళ్ళ వారసులకు ఛాన్స్ లేకుండా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More