డైరెక్టర్ కి ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్ !

Published on Aug 1, 2021 11:36 pm IST

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. దర్శకుడు కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) మెగాస్టార్‌ చిరంజీవికి వీరాభిమాని. కాగా బాబీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా చిరంజీవిని కలిసి బ్లెస్సింగ్స్‌ తీసుకున్నారు. బాబీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి ఓ ప్రత్యేకమైన పెన్ ను బహుమతిగా ఇచ్చారు.

ఈ బహుమతి తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ ఆ గిఫ్ట్‌ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు బాబీ. ఇక బాబీ రాసిన కథ మెగాస్టార్ కి బాగా సూట్ అవుతుందని.. ముఖ్యంగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడ ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ.

సంబంధిత సమాచారం :