ట్విట్టర్ మహిమ.. మెగాస్టార్ వయసు తగ్గిపోయింది

Published on Mar 26, 2020 9:03 pm IST

మెగాస్టార్ చిరు ట్విట్టర్ ఎంట్రీ చాలా విశేషంగా నడుస్తోంది. మొదటిసారి ఆయన ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయడంతో సినీ సెలబ్రిటీలంతా ఆయనకు సాదర స్వాగతం పలుకుతున్నారు. నాగర్జున, సుహాసిని, మొహాన్ లాల్, రాధిక, ఎన్టీఆర్, మహేష్ బాబు, కాజల్, నితిన్, నిఖిల్, శ్రీకాంత్, తమన్నా, కొరటాల శివ, రాజమౌళి, పూరి జగన్నాథ్, ఖుష్బూ ఇలా అందరూ వెల్కమ్ చెప్పగా చిరు ఒక్కొక్కరికి ఒక్కోలా కృతజ్ఞతలు తెలిపారు.

అది కూడా సాదాసీదాగా కాదు చాలా చలాకీగా ఒక్కొక్కరికీ ఒక్కోలా చెప్పారు. ఇక ఆప్త మిత్రుడు మోహన్ బాబు వెల్కమ్ మిత్రమా అంటూ స్వాగతించగా థ్యాంక్యూ చెబుతూ సరదాగా రాననుకున్నావా.. రాలేననుకున్నావా అంటూ తన ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్ వదిలారు. దానికి మోహన్ బాబు సైతం ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెబుతాను అన్నారు. మొత్తానికి చిరు వేస్తున్న సరదా ట్వీట్స్ చూస్తే సోషల్ మీడియాలోకి వచ్చేసరికి మెగాస్టార్ వయసు ఒక్కసారిగా వెనక్కి వెళ్లిందేమో అనిపిస్తోంది. ఇకపోతే ఆయనకు ఫాలోవర్లు కూడా వేగంగానే పెరుగుతున్నారు. ఇప్పటికే లక్షా 64 వేల మంది ఆయన్ను అనుసరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More