తన బయోగ్రఫీపై మెగాస్టార్ కీలక కామెంట్స్.!

తన బయోగ్రఫీపై మెగాస్టార్ కీలక కామెంట్స్.!

Published on Jan 21, 2024 8:00 AM IST

మన టాలీవుడ్ సినిమా లెజెండరీ హీరో నిరంతర కృషీవలుడు మెగాస్టార్ చిరంజీవి కోసం తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో చిరంజీవి చూడని విజయం లేదు అలాగే చూడని పరాజభావం కూడా లేదు. ఇక అవన్నీ పక్కన పెట్టి తనకి అన్నం పెట్టిన సినిమాలోనే మళ్ళీ తాను బిజీగా ఉండగా తన ఆత్మకథ లేదా జీవిత చరిత్రపై కానీ ఓ సినిమా లాంటిది వస్తే అనే అంశం చాలా ఆసక్తిగా ఉన్న ప్రశ్న.

కానీ బయోపిక్ సినిమా కోసం ఏమో కానీ తన బయోగ్రఫీ పై మాత్రం చిరంజీవి తాజాగా ఒక కీలక అప్డేట్ ని అందించారు. తాను తన ఆత్మ కథ రాసుకునే సమయం ఉండదు అని అందుకే ఆ బాధ్యతని తన సినీ కెరీర్ లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ రచయిత యండమూరికి ఆ బాధ్యతలను అప్పగిస్తున్నట్టుగా చిరంజీవి ఇటీవల పాల్గొన్న ఒక కార్యక్రమంలో తెలియజేసారు. దీనితో తన బయోగ్రఫి అనేది యండమూరి రచన ద్వారానే వస్తుంది అనేది ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు