టీఎన్ఆర్ కుటుంబానికి మెగస్టార్ చిరంజీవి సాయం..!

Published on May 12, 2021 3:00 am IST

ప్రముఖ యూట్యూబ్ యాంకర్, నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కరోనా బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే టీఎన్ఆర్ మృతిపట్ల మెగస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే టీఎన్ఆర్ భార్యా పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించిన మెగస్టార్ చిరంజీవి లక్షరూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు. అయితే టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు చూశానని, ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం బాగుంటుంది, పట్టుదలతో ఎదిగిన టీఎన్ఆర్ ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తారని చిరంజీవి అన్నారు. అయితే ఎలాంటి అవసరం వచ్చినా మీ కుటుంబానికి అండగా ఉంటానని చిరంజీవి వారికి హామీ ఇచ్చాడు.

అయితే ఫోన్‌లో చిరంజీవితో మాట్లాడిన టీఎన్ఆర్ భార్య మీరంటే ఆయనకు వీరాభిమానం సార్ అని, తన 200వ ఇంటర్వ్యూ మీతోనే చేయాలని అనుకునేవారని, ఇంతవరకు మిమ్మల్ని కలవలేదు కానీ మీరు మాకిలా ఫోన్ చేయడం ఎంతో సంతోషం కలిగించిందని ఆమె చెప్పుకుంటూ బాధపడ్డారు.

సంబంధిత సమాచారం :