గూగుల్ సెర్చ్ లో సౌత్ నుండి టాప్ ప్లేస్ లో మెగాస్టార్ !

గూగుల్ సెర్చ్ లో సౌత్ నుండి టాప్ ప్లేస్ లో మెగాస్టార్ !

Published on Dec 13, 2018 5:59 PM IST

2018 కి గాను గూగుల్ మోస్ట్ సెర్చెడ్ పర్సనాలిటీ లో సౌత్ నుండి మెగాస్టార్ చిరంజీవి టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. చాలా మంది ఆయన గురించి గూగుల్ లో అన్వేషించారు. ఆయన తరువాత నాని , బాలకృష్ణ , విజయ్ దేవరకొండ , రష్మిక , అనసూయ భరద్వాజ్ , ప్రకాష్ రాజ్ , మోహన్ బాబు , జగపతి బాబు , నాగ శౌర్య ల కోసం ఎక్కువ మంది సెర్చ్ చేశారు.

ఇక ఇండియా లో అత్యధికంగా మలయాళ యువ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ గురుంచి గూగుల్ లో అన్వేషించారు. ప్రియా ప్రకాష్ ‘ఓరు అడ్డర్ లవ్’ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవి’ అనే వింక్ సాంగ్ తో ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించింది.

ఆమె తరువాత ప్రియాంక చోప్రా -నిక్ జోనస్ ల గురించి ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేశారు. తాజాగా గూగుల్ ఇండియా ఈ వార్తలను అధికారికంగా ప్రకటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు