చిరు – కొరటాల సినిమా మొదలయ్యేది అప్పుడేనా ?

Published on Jan 4, 2019 3:54 am IST


మెగాస్టార్ చిరంజీవి తన తర్వాత చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నారని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇటు కొరటాల నుండి గాని, అటు మెగా క్యాంపు నుండి గాని ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కానీ తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కొరటాల శివ, మెగాస్టార్ తో చెయ్యబోతున్న సినిమా ఈ వేసవి నుంచి మొదలు కానుందని తెలుస్తోంది. చిరు కోసం కొరటాల ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేశారట.

ప్రస్తుతం మెగాస్టార్ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రంతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

X
More