చిరు, కొరటాల శివ మూవీపై ఓ క్లారిటీ వచ్చిందిగా…!

Published on Jun 1, 2019 9:35 am IST

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కంబినేషన్లో ఓ మూవీ చేయాలని రామ్ చరణ్ ఓ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ క్రేజీ ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారంట కొరటాల శివ.ఆగస్ట్ 22న చిరు పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరిపి , అదే నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లేలా ప్లానింగ్ జరుగుతోందట.

సామజిక అంశాలకు కమర్షియల్ హంగులు అద్ది తెరకెక్కించడంలో దిట్టైన శివ, చిరు కోసం ఇలాంటి కథే ఒకటి సిద్ధం చేసారంట. ఈ సినిమాలో చిరంజీవి డ్యుయెల్ రోల్స్ లో కనువిందు చేయబోతున్నారట. రైతన్నగా ఓ పాత్ర, యన్.ఆర్.ఐ గా మరో పాత్ర ఉంటుందట. సోషల్ డ్రామాతో తెరకెక్కనున్న ఈ సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుందట.

చిరు సరసన మెయిన్ లీడ్ హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు, సెకండ్ లీడ్ కోసం శ్రద్ధాశ్రీనాధ్ ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారమ్. ఇప్పటివరకు ఓటమి ఎరుగని శివ మెగాస్టార్ చిరుకి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తాడో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More