చిరంజీవి, మహేష్ బాబుల ఒకే దర్శకుడితో పనిచేయాలనుకుంటున్నారా ?

సినిమా మేకింగ్ ను ప్రత్యేకంగా భావిస్తూ సినిమాలు చేసే దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి. ఆయన్నుండి ‘అష్టా చెమ్మా, గోల్కొండ హైస్కూల్, అమీ తుమీ’ తో పాటు ఇటీవలే విడుదలైన ‘సమ్మోహనం’ లాంటి మంచి సినిమాలు వచ్చాయి. ‘సమ్మోహనం’ సక్సెస్ తో ఆయన ఇమేజ్ కూడ బాగానే పెరిగింది.

సినిమా చూసిన ప్రేక్షకులు ఆయన ఇలాంటి సినిమా ఇంకెన్నో చేయాలని అభిప్రాయపడుతుంటే సినీ హీరోలు కొందరు ఆయనలోని దర్శకత్వ ప్రతిభ చూసి ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారట. అలాంటి వారిలో స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నారట. ‘సమ్మోహనం’ చిత్రాన్ని చూసిన ఈ ఇద్దరు హీరోలు ఇంద్రగంటిని తమ కోసమా స్క్రిప్ట్ రెడీ చేయమని కోరినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలే గనుక వాస్తవమైతే ఇంద్రగంటి వాళ్ళ కోసం ఎలాంటి కథల్ని రెడీ చేస్తారో చూడాలి.