లేటెస్ట్..మహేష్ కుటుంబాన్ని పర్సనల్ గా కలిసి పరామర్శించిన చిరు.!

Published on Sep 29, 2022 1:30 pm IST

టాలీవుడ్ ప్రముఖ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కి నిన్ననే మాతృ వియోగం జరిగింది. మరి ఈ విషాద ఘటనతో మహేష్ కుటుంబం అంతా కూడా తీవ్ర దిగ్బ్రాంతికి లోను కాగా టాలీవుడ్ సహా రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ప్రత్యక్షంగా మహేష్ ని వారి కుటుంబీకులని కలిసి పరామర్శించారు.

మరి నిన్న మెగాస్టార్ చిరంజీవి అయితే మొదట సోషల్ మీడియాలో తన మాటలు తెలియజేయగా ఈరోజు అయితే కృష్ణ గారి కుటుంబాన్ని పర్సనల్ గా కలిసి పరామర్శించారు. మరి ఇందిరా దేవి గారికి నివాళులు అర్పించి కాసేపు అక్కడే ఉండి కృష్ణ మరియు మహేష్ బాబు లతో మాట్లాడారు. దీనితో ఇప్పుడు ఈ విజువల్స్ వైరల్ గా మారాయి. అయితే చిరు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉండడం మూలాన నిన్న కలవడం జరగలేదు అందుకే ఈరోజు కలిసి చిరు వారికి ధైర్యం చెప్పారు.

సంబంధిత సమాచారం :