గుంటూరులో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటుకు సర్వం సిద్ధం

Published on May 26, 2021 3:00 am IST

కరోనా కష్ట కాలంలో మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేయాలనే గొప్ప నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఈ ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటుచేసి ఆక్సిజన్ అవసరం ఉన్నవారికి ఉచితంగా అందివ్వాలనేది చిరు సంకల్పం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ ఆక్సిజన్ బ్యాంక్స్ పనుల్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వీటి ఏర్పాటుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా రేపు గుంటూరు జిల్లాలో ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి.

ఈరోజు హైదరాబాద్లో ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నందు చిరంజీవి గుంటూరు చేరవలసిన ఆక్సిజన్ సిలిండర్లును పరిశీలించారు. చిరంజీవి అభిమాన సంఘాల సీనియర్ అధ్యక్షులే ఎక్కడికక్కడ ఈ బ్యాంక్స్ ఏర్పాటు బాధ్యతలను చూసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం కర్ణాటకలో కూడ అక్కడి చిరు అభిమాన సంఘంవారు ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహత్తర కార్యక్రమంలో మెగా అభిమానులు కూడ విరాళాలు అందిస్తూ భాగస్వాములు అవుతున్నారు.

సంబంధిత సమాచారం :