సోదర సమానుడైన హరికృష్ణ మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది – చిరంజీవి
Published on Aug 29, 2018 6:25 pm IST

నందమూరి హరికృష్ణగారి మరణంతో సినీ రాజకీయ రంగాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. హరికృష్ణగారి మృతి పై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేయటానికి మెహిదీపట్నంలో ఆయన నివాసానికి తరలివస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, హరికృష్ణ నివాసానికి వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.

చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. నందమూరి హరికృష్ణ అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. మేం ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నేవాళ్ళం, ఆయన ఎంతో సరదగా మాట్లాడుతూ జోక్స్ వేస్తూ నవ్వించేవారు. అలాంటి ఆత్మీయ మిత్రుడు, సోదర సమానుడు మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని చిరంజీవి అన్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook